‘డైపర్ కోహ్లీ’కి సచిన్ ట్రెయినింగ్

‘డైపర్ కోహ్లీ’కి సచిన్ ట్రెయినింగ్

ముంబై: రెండేళ్ల క్రితం డైపర్ వేసుకుని ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటుతో అద్భుతమైన కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్‌‌‌‌లు ఆడుతూ  సోషల్ మీడియాను షేక్ చేసిన బుడ్డోడు గుర్తున్నాడా?. ఆ ఒక్క వీడియోతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించి, డైపర్​ క్రికెటర్​.. డైపర్​ కోహ్లీగా ఫేమస్​ అయిన ఈ కోల్​కతా బుడ్డోడు తాజాగా తన ఆరాధ్య క్రికెటర్​ సచిన్ టెండూల్కర్ ను కలిశాడు. తనను ఆదర్శంగా తీసుకుని క్రికెటర్ గా ఎదగాలనుకుంటున్న ఐదేళ్ల ఎస్.కె షాహిద్ గురించి తెలుసుకున్న టీమిండియా లెజెండ్ సచిన్ సొంత ఖర్చులతో అతడికి ఐదు రోజుల స్పెషల్‌‌‌‌ ట్రెయినింగ్ ఇప్పించాడు. అతడి కలను నిజం చేశాడు. ముంబైలోని టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీలో షాహిద్‌‌‌‌కు  సచిన్ దగ్గరుండి మెళకువలు నేర్చించాడు. అతడికి కొన్ని టిప్స్‌‌‌‌ కూడా చెప్పి సంతకం చేసిన ఓ బ్యాట్‌‌‌‌ను గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చాడు.  ‘మేం అప్ లోడ్ చేసిన వీడియో చూసిన సచిన్ సర్ మమ్మల్ని ముంబైకి ఆహ్వానించారు. ఐదు రోజుల పాటు అకాడమీలో షాహిద్ కు క్రికెట్ ట్రెయినింగ్ ఇప్పించారు. బ్యాక్ ఫుట్, ఫ్రంట్ ఫుట్ లో ఎలాంటి షాట్స్ ఆడాలో చూపించారు. క్యాచ్ లు ఎలా పట్టాలో నేర్పారు. షాహిద్ లో ఎంతో ప్రతిభ ఉందని మెచ్చుకున్నారు. సచిన్ సర్ చేసిన దానికి కేవలం థ్యాంక్స్ చెబితే సరిపోదు’ అని షాహిద్ తండ్రి షేక్ షంషేర్‌‌‌‌ తెలిపాడు.