కూతురు, మనవడి చావు వార్త తట్టుకోలేక.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

కూతురు, మనవడి చావు వార్త తట్టుకోలేక.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

కరీంనగర్: కన్నతల్లికి ఎంతకష్టం వచ్చిందో.. ఏ తల్లి ఇలాంటి కర్కషమైన నిర్ణయం తీసుకోదు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన శ్రీజ(32) మంగళవారం ఉదయం తన ఏడాది కొడుకుకి పురుగుల మందు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. మనవడు, కూతురు మరన వార్త తట్టుకొలేక శ్రీజ తల్లి జయప్రద కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

జయప్రదను హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందింది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి వరుస హత్మహత్యలకు గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది.