
హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా సెకం డరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) నేష నల్ సెక్రటరీ జనరల్‌గా జి.సదానందం గౌడ్ ఎన్నికయ్యారు. కర్నూల్లో జరిగిన జాతీయ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదానందంగౌడ్ ప్రస్తుతం ఎస్టీయూటీఎస్స్టేట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి మాట్లాడారు. ఏఐఎస్టీఎఫ్ టీచర్ల సమస్యలపై చర్చించి ఉద్యమాలు చేపడుతుం దని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయస్థా యిలో విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచ నలు ఇస్తుందని చెప్పారు.