ఎమ్మెల్యే రేఖా నాయక్ చేతుల మీదుగా నీరు విడుదల.. నేడు గండి

ఎమ్మెల్యే రేఖా నాయక్ చేతుల మీదుగా నీరు విడుదల.. నేడు గండి

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కడెం మండల రైతన్నలకు ‘సదర్మాట్’ జీవనోపాధి. సదర్మాట్ ఎడమ కాల్వ నుంచి రెండు మండలాల రైతులకు పంట భూములకు సాగు నీరందిస్తోంది. కానీ... సదర్మాట్ కాల్వకు గండ్లు పడుతున్నాయి. వర్షాకాలంలో భారీ వర్షాలకు సదర్మాట్ ఆయకట్టు పై భాగంలో సైడ్ వాళ్లు పూర్తిగా కూలిపోయింది. తాత్కాలికంగా ఇసుక సంచులతో మరమ్మత్తులు అధికారులు చేపట్టారు. లెటెస్ట్ గా కాల్వకి మరోసారి గండి పడింది. ఛానల్ గేట్ 574 కు ఇరువైపులా ఉన్న కట్టలకు గండ్లు పడ్డాయి.

రెండు రోజుల క్రితమే సాగు కోసం నీటిని అధికారులు వదిలారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ చేతుల మీదుగా నీటిని విడుదల చేయగా ఇవాళ కెనాల్ కి గండి పడింది. రూ.22 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. మరమ్మతు చేసిన ప్రాంతానికి నీరు రావడంతో మళ్ళీ గండి పడింది. నాణ్యత లోపం వల్లే స్థానికులు గండి పడిందంటున్నారు. వారం రోజుల నుండి వరి నార్లు రైతులు పోశారు.  ప్రస్తుతం గండి పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.