
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలను పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలన్నీ ఒకదగ్గర పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ ఆడుతూ.. పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించారు. ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీరా బతుకమ్మ’ అంటూ వీడ్కోలు పలికారు.
ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వేడకల్లో పలుచోట్ల ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్‌నాయక్, కూనంనేని సాంబశివరావుతోపాటు స్థానిక నాయకులు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఖమ్మం సిటీలోని మున్నేరు నది ఘాట్ వద్ద బతుకమ్మలతో మహిళలు కిక్కిరిసిపోయారు. - నెట్వర్క్, వెలుగు