
రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని నెహ్రూ జూపార్క్ కు కూడా వరద పోటెత్తింది. జూపార్క్ పక్కనే మీరాలం చెరువు ఉండగా..అది నిండడంతో పార్క్ లోకి నీరు చేరింది. భారీ వరద రావడంతో జూపార్క్ లోని సఫారీని మూసివేశారు. సఫారీ మాత్రమే మూసివుంటుందని.. మిగితా జూపార్క్ యథావిధంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సందర్శకులు పార్క్ కు రావొచ్చని సూచించారు. కాగా నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండకుండలా మారాయి.