
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో సోమవారం పలువురు ఉద్యోగులకు ‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ 11 మంది ఉద్యోగులకు ఈ అవార్డులను అందజేశారు. చురుకుతనం, అంకితభావంతో పనిచేసిన లోకో పైలట్లు, పాయింట్స్ ఉమెన్, గేట్ మ్యాన్, ట్రైన్ మేనేజర్లకు ఈ అవార్డులు అందజేసినట్లు తెలిపారు. అంతకుముందు భద్రతపై సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, డీఆర్ఎంలు పాల్గొన్నారు.