సకుటుంబ సమేతంగా ‘సఃకుటుంబానాం’

సకుటుంబ సమేతంగా ‘సఃకుటుంబానాం’

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సఃకుటుంబానాం’. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం న్యూ ఇయర్ రోజున ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోందని తెలియజేసిన టీమ్.. శనివారం సక్సెస్ మీట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది. 

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘కుటుంబ కథా  చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ముందుంటారు. అలాంటి ఈ చిత్రానికి సకుటుంబ సమేతంగా వచ్చి  ఆదరించడం  ఆనందాన్ని ఇస్తుంది. థియేటర్లు పెరుగుతున్నాయి అంటే సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం అవుతుంది’ అని అన్నారు. తమ  సినిమాను ఆదరించి మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు నటుడు రామ్ కిరణ్, దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు.