డిసెంబర్‎లో సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ రిలీజ్

డిసెంబర్‎లో సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ రిలీజ్

సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టై న్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'సంబరాల ఏటిగట్టు'. రీసెంట్గా ముంబై షెడ్యూల్ కంప్లీట్ కాగా, ఆదివారం నుంచి హైదరాబాద్లో చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభం కోసం ఓ భారీ సెట్ను నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన ఘట్టాలు ఉంటాయని, ఇది ఒక మరపురాని సినిమా ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. 

ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని, అలాగే డిసెంబర్లో ఈ చిత్రా న్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సాయి దుర్గ తేజ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది. టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్,శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అం దిస్తున్నాడు.