షాకిస్తున్న సాయి పల్లవి రెమ్యునరేషన్.. హీరోలకన్నా చాలా ఎక్కువ!

షాకిస్తున్న సాయి పల్లవి రెమ్యునరేషన్.. హీరోలకన్నా చాలా ఎక్కువ!

మళయాళ కుట్టి సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మళయాళ ప్రేమమ్ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అద్భుతమైన నటనతో కుర్రకారును కట్టిపడేసింది. ఆమె నటనకు కాదు నేచురల్ బ్యూటీకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరో రేంజ్ లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది అనడంలే ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమెను ఫ్యాన్స్ ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. 

నార్మల్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే సాయి పల్లవి చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు గ్లామర్ షోకు కూడా దూరంగా ఉంటారు. అందుకే సాయి పల్లవి ఒక సినిమా ఒకే చేశారంటే.. ఆ సినిమాపై ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడతాయి. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి.. ఇటీవలే నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాను ఒకే చేశారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సాయి పల్లవి క్రేజ్ అండ్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదట. తన తరువాత సినిమాల కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అది కూడా కొంతమంది హీరోలకన్నా ఎక్కువగా. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట సాయి పల్లవి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.