
ప్రభాస్‌తో ‘కల్కి 2898 ఏడీ’ లాంటి పాన్ ఇండియా సినిమా తీసి మెప్పించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయబోతున్నాడు. నిజానికి ఆయన కల్కి సీక్వెల్ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో ఈలోపు ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇందులో బాలీవుడ్ స్టార్ అలియా భట్ నటించాల్సి ఉండగా.. ఇప్పుడా స్థానంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. మాడాక్ ఫిల్మ్స్ హారర్ ఫ్రాంచైజీలో వస్తున్న ‘ఛాముండ’ అనే చిత్రంతో అలియా బిజీగా ఉండడంతో, ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ సాయిపల్లవితో సంప్రదింపులు చేస్తున్నాడు. ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ లాంటి హ్యూజ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించబోతోంది. ఎలాంటి పాత్ర అయిన తనదైన యాక్టింగ్‌తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే సాయిపల్లవి.. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో కలిసి వర్క్ చేయనుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఆమె ‘రామాయణ’లో నటిస్తుండడం కూడా ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తీసుకురానుంది.