సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'లగ్గం'. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
రమేశ్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి స్పందన బాగానే వచ్చింది. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో వస్తున్న చిత్రం లగ్గం. గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందిందనే విషయం ట్రైలర్ తోనే స్పష్టం చేసింది.
ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌కి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే వాళ్ల ఊరిలో అందరికీ సాఫ్ట్‌వేర్ అల్లుళ్లను తీసుకొస్తా అంటాడు. అయితే ఓ సమస్య కారణంగా హీరో హీరోయిన్ల పెళ్లి ఆగిపోతుంది. ‘లగ్గం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.. ఇద్దరు మనసులు కలవడం’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ మరియు మిగతా ఎమోషనల్ అంశాలు సినిమాపై ఆసక్తిని, అంచనాలు పెంచాయి. దాంతో లగ్గం సినిమా ఈ దీపావళి సందర్బంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Grand releasing in world wide October 25th #Laggam - #SaiRonak, #PragyaNagra | Ramesh Cheppala | Charan Arjun | #RajendraPrasad@2gentertainmen1 pic.twitter.com/vg2yTwaAfF
— 2G Entertainments Ltd (@2gentertainmen1) October 20, 2024
ఈ చిత్రంలో రోహిణి, సప్తగిరి, ఎల్.బి. శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ స్వరాలూ సమకూర్చగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించారు. కాగా ఈ మూవీని ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.