FIFA World Cup: సాయిబరి మెరుపు గోల్‌‌‌‌.. స్కాట్లాండ్పై మొరాకో కీలక విజయం.

FIFA World Cup:  సాయిబరి మెరుపు గోల్‌‌‌‌.. స్కాట్లాండ్పై మొరాకో కీలక విజయం.

ఫాక్స్‌‌‌‌బరో: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మొరాకో కీలక విజయాన్ని అందుకుంది. గ్రూప్‌‌‌‌–సిలో 1–0తో స్కాట్లాండ్‌‌‌‌ను ఓడించి నాకౌట్‌‌‌‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌‌‌‌ ప్రారంభమైన 72 సెకన్లలోనే ఇస్మాయిల్‌‌‌‌ సాయిబరి మెరుపు గోల్‌‌‌‌ చేశాడు. బ్రాహిమ్‌‌‌‌ డియాజ్‌‌‌‌ నుంచి పాస్‌‌‌‌ అందుకున్న 25 ఏళ్ల సాయిబరి ఇద్దరు డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ పైభాగంలోకి పంపాడు.

స్కాట్లాండ్‌‌‌‌ గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ అంగస్‌‌‌‌ గన్‌‌‌‌ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా సక్సెస్‌‌‌‌ కాలేదు. ఇక్కడి నుంచి స్కాట్లాండ్‌‌‌‌ ఆరుసార్లు, మొరాకో 12 సార్లు ప్రయత్నించినా గోల్స్‌‌‌‌ కొట్టలేకపోయాయి. తొలి హాఫ్‌‌‌‌లో ఇంజ్యురీ టైమ్‌‌‌‌లో ఆండీ రాబర్ట్‌‌‌‌సన్ అందించిన క్రాస్‌‌‌‌ను జాన్ మెక్‌‌‌‌గిన్ గోల్‌‌‌‌గా మలచడంలో విఫలమయ్యాడు. సెకండాఫ్‌‌‌‌లోనూ స్కాట్లాండ్ స్కోరు సమం చేయడానికి గట్టిగానే శ్రమించినా మొరాకో డిఫెండర్లు గోల్ పోస్ట్ వైపు రాకుండా అడ్డుకున్నారు.