సైదాబాద్ హనుమాన్ దేవాలయ ప్రహరి కూల్చివేత..ఉద్రిక్తత

సైదాబాద్ హనుమాన్ దేవాలయ ప్రహరి కూల్చివేత..ఉద్రిక్తత

సైదాబాద్ హనుమాన్ దేవాలయం ప్రహరి కూల్చివేతేపై ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న పురాతన హనుమాన్ దేవాలయానికి సంబంధించిన మఠాలను, ప్రహరి గోడను అధికారులు కూల్చివేశారు. మలక్ పేట క్రాస్ రోడ్ నుండి సంతోష్ నగర్ వరకు నిర్మిస్తున్న  స్టీల్ బ్రిడ్జ్ పనులలో భాగంగా ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో.. దేవాలయ కమిటీకి, దేవాదాలయశాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారు. దీంతో భక్తులు, స్థానికులు ఆలయ ఈఓ ను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రహరి గోడను కూల్చివేశారని ఈఓ తెలిపారు.

ALSO READ:మార్కెట్ కు స్థలం కేటాయింపుపై హైకోర్టు స్టే

అయితే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి కూల్చివేతలు చేపటోద్దన్న హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డీవో వ్యవహరించారని దేవాలయ కమిటీ సభ్యులు తెలుపారు. దీంతో ఆర్డీఓ వ్యవహార శైలిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి, కొత్త కాపు రవీందర్ రెడ్డి, సహదేవ్ యాదవ్, ex కార్పొరేటర్ స్వర్ణలత రెడ్డి హుటాహుటిన దేవాలయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.