సైదాబాద్ ఘటన నిందితున్ని పట్టుకుంటాం.. ఎన్ కౌంటర్ చేస్తాం : మల్లా రెడ్డి

V6 Velugu Posted on Sep 14, 2021

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడ్ని తప్పకుండా పట్టుకుంటాం.. ఎన్ కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటన చాలా ఘోరం అన్నారు. ఘటన అందర్నీ కుదిపేస్తుంటే మీరేం చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వెంటనే తీవ్రంగా స్పందించారు. ‘‘ఇలాంటి వాళ్లను తప్పకుండా ఎన్ కౌంటర్ చేయాలె.. తప్పకుండా వాడ్ని పట్టుకుంటాం.. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచేది లేదు..  బాధిత కుటుంబాన్ని తప్పకుండా పరామర్శిస్తాం. ఓదారుస్తాం..’’ అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. కాస్త ఓపిక పట్టండి అంటూ మంత్రి మల్లారెడ్డి సమాధానం ఇచ్చారు. 
 

Tagged Minister Malla Reddy, Hyderabad Today, , Saidabad Singareni Colony, saidabad minor rape and murder, Minister Mall Reddy, Malla Reddy comments, Minister Malla Reddy latest updates

Latest Videos

Subscribe Now

More News