సజన, శోభనకు చాన్స్‌‌‌‌‌‌‌‌

సజన, శోభనకు చాన్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ టీమ్ ఈ నెల 28 నుంచి బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో పర్యటించనుంది. బంగ్లాతో ఆడే ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం విమెన్స్‌‌‌‌‌‌‌‌ సెలక్షన్  కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటిన సజన సజీవన్‌‌‌‌‌‌‌‌, ఆశా శోభన నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఈ నెల 28, 30, మే 2, 6, 9వ తేదీల్లో సిల్హెట్‌‌‌‌‌‌‌‌లో 5 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. 
 

జట్టు: హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్), షెఫాలీ వర్మ, డి. హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (కీపర్), యాస్తికా భాటియా (కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమన్‌‌‌‌‌‌‌‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా ఠాకూర్, టిటాస్ సాధు.