షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక వెనుక చంద్రబాబు కుట్ర : సజ్జల

 షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక వెనుక చంద్రబాబు కుట్ర : సజ్జల

కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు షర్మిల కాంగ్రెస్​లో చేరడం వెనుక చంద్రబాబు  కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్​కు టచ్​ లోనే ఉన్నారని.. తనకు ఏం కావాలో ఆపనిని మిగతా వారితో చంద్రబాబు చేయించుకుంటారని సజ్జల విమర్శించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్​ కలిసి జగన్​ పై అక్రమ కేసులు పెట్టారన్నారు.  బీజేపీను పవన్​ మ్యానేజ్​ చేస్తే కాంగ్రెస్​ ను చంద్రబాబు మ్యానేజ్​ చేస్తున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సంక్షేమం పేరుతో చంద్రబాబు ఎన్నికలకు వెళితే మైనస్​ మార్కులొస్తాయంటూ.... షర్మిల తన పార్టీని కాంగ్రెస్​ లో విలీనం చేయడానికి సీఎం రమేష్​ ఫ్లైట్​ లో ఢిల్లీకి వెళ్తే.... బ్రదర్​ అనీల్​ కుమార్​ ఎయిర్​ పోర్టులో బీటెక్​ రవితో భేటీ అయ్యారన్నారు. ప్రజలా... కుటుంబమా అంటే వైఎస్​ జగన్​ ప్రజలకే ప్రాధాన్యత ఇస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  

 ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు.  రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్ కుటుంబం కోసం పార్టీ పెట్టలేదని తెలిపారు. తమ విధానాలు తమకు ఉన్నాయని.. పార్టీ వీడటానికి కారణం వాళ్ళే చెప్పారన్నారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుందని సజ్జల తెలిపారు.తమకు ఇప్పటికీ వైఎస్ మరణం పై అనుమానాలు ఉన్నాయన్నారు. షర్మిల సీఎం రమేష్ హెలికాప్టర్ లో రావటం, బ్రదర్ అనిల్ బీటెక్ రవితో భేటీ… చూస్తే వెనుక ఎవరు ఉన్నారో అర్థం అవుతుందని సజ్జల ఆరోపించారు.