‘క్యూనెట్’కు సానియా మద్దతుపై సజ్జనార్ ట్వీట్

‘క్యూనెట్’కు సానియా మద్దతుపై సజ్జనార్ ట్వీట్

మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ ‘క్యూనెట్’కు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను నాశనం చేసే మల్టీ-లెవల్ మార్కెటింగ్ కంపెనీలకు మద్దతు ఇవ్వడం/ప్రమోట్ చేయడం మానుకోవాలని టీఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. తాను సెలబ్రిటీలందరినీ వినమ్రంగా అభ్యర్థిస్తున్నానుని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

క్యూనెట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం  మనీలాండరింగ్, హవాలా ఆరోపణలపై తనిఖీలు నిర్వహించింది. క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ సోదాలు జరిగాయి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే క్యూనెట్‌కు చెందిన 36 బ్యాంకుల్లో దాదాపు రూ.90 కోట్లు ఫ్రీజ్ చేశారు. కాగా 2019 జనవరిలో ‘క్యూనెట్‌’ మోసాలు వెలుగులోకి వచ్చాయి.