
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాంచైజీ ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్‌ను శుక్రవారం హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో.. చేతిలో కత్తి, శరీరమంతా రక్తంతో కనిపిస్తున్న ప్రభాస్ లుక్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో డిసెంబర్ 22న రాబోతోందనే ప్రచారం మొదలైంది. దాన్నే నిజం చేస్తూ ఈ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘డంకీ’ చిత్రం కూడా అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో బాలీవుడ్, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.