ఓఎఫ్ఎస్ ద్వారా IDBI లో వాటా అమ్మకం! పబ్లిక్ షేర్హోల్డింగ్ పెంచాలని ప్రభుత్వ ప్లాన్

ఓఎఫ్ఎస్ ద్వారా IDBI లో వాటా అమ్మకం! పబ్లిక్ షేర్హోల్డింగ్ పెంచాలని ప్రభుత్వ ప్లాన్

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ  ఐడీబీఐ బ్యాంక్‌‌లో పబ్లిక్ షేర్‌‌హోల్డింగ్‌‌ను పెంచేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) కు వెళ్లాలని కేంద్రం ప్లాన్  చేస్తోంది.  ప్రస్తుతం బ్యాంక్‌‌లో పబ్లిక్ ఫ్లోట్ (మార్కెట్‌‌లో ట్రేడవుతున్న షేర్లు)  కేవలం 5.29శాతం మాత్రమే ఉంది. మిగతా వాటాలు ఎల్‌‌ఐసీ (49.24శాతం), కేంద్ర ప్రభుత్వం (45.48శాతం) వద్ద ఉన్నాయి. 

ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం–ఎల్‌‌ఐసీ కలిపి 60.72శాతం మెజారిటీ వాటాను  విక్రయించాలని అనుకున్నాయి. కానీ, కేవలం రెండు సంస్థలే  రిజర్వ్ ధరకు బిడ్డింగ్ వేయడంతో ఈ ప్లాన్ ఫెయిలైంది.  ఓఎఫ్‌‌ఎస్‌‌  ద్వారా పబ్లిక్ ఫ్లోట్‌‌ 10–15శాతం  పెరిగితే మార్కెట్‌‌లో షేర్లకు మంచి ధర వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.   ఐడీబీఐ  ప్రైవేటైజేషన్ ప్రయత్నాలు 2016లో మొదలయ్యాయి. ఎల్‌‌ఐసీ మెజారిటీ వాటా కొన్న తర్వాత ప్రైవేట్ బ్యాంక్‌‌గా మారింది.