ఏడాదికి 70 లక్షల పాత కార్ల అమ్మకాలు

ఏడాదికి 70 లక్షల పాత కార్ల అమ్మకాలు
  • 2025-26 నాటికి ఏడాదికి 70 లక్షల కార్లకు చేరుకోనున్న అమ్మకాలు  
  • సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్ ఏడాదికి 15 శాతం వృద్ధి చెందుతోంది
  • ఓఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఆటోస్‌‌‌‌-క్రిసిల్‌‌‌‌ స్టడీలో వెల్లడి 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలో సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇంకొన్నేళ్లలో  దేశంలో కొత్తగా అమ్ముడయ్యే కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్ల  సేల్సే ఎక్కువగా జరుగుతాయని ఓ స్టడీ వెల్లడించింది. కరోనా సంక్షోభంతో ప్రజల ఆలోచనల్లో మార్పులొచ్చాయని, సొంతంగా వెహికల్‌‌‌‌ ఉండడం అవసరమనే ఆలోచన పెరిగిందని ఓఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఆటోస్‌‌‌‌–క్రిసిల్‌‌‌‌ స్టడీ–2021 వివరించింది. రానున్న కొన్నేళ్ల పాటు సెకండ్ హ్యాండ్ కార్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ఏడాదికి 12–15 శాతం వృద్ధి సాధిస్తుందని ఈ రిపోర్ట్ తెలిపింది. 2020–21 లో సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్‌‌‌‌ సైజు  38 లక్షల కోట్ల యూనిట్లు.  ఇది 2025–26 నాటికి 70 లక్షల కార్లకు పెరుగుతుందని ఈ స్టడీ  అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్ 15 శాతం వృద్ధి సాధిస్తుందని ఈ స్టడీ లెక్కించింది. డిజిటైజేషన్ పెరగడం, కరోనా సంక్షోభం, మొదటి సారిగా కారును కొనాలనుకునేవారు, వివిధ ఫైనాన్షింగ్ ఆప్షన్లు ఉండడం వంటివి సెకండ్ హ్యాండ్‌‌‌‌ కారు మార్కెట్‌‌‌‌ పెరగడానికి కారణమవుతాయని ఈ స్టడీ అంచనావేసింది. ‘కొత్త కార్లను అమ్మే మార్కెట్ కంటే సెకండ్ హ్యండ్ కార్లను అమ్మే మార్కెట్‌‌‌‌  ఎక్కువ వృద్ధి సాధిస్తోంది’ అని ఓఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఆటోస్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. ‘భవిష్యత్‌‌‌‌లో కూడా ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌  మంచి గ్రోత్‌‌‌‌నే నమోదు చేస్తుంది. వచ్చే కొన్నేళ్ల పాటు సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్ ఏడాదికి 12–14 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. ఈ మార్కెట్ సైజు 2025–26 నాటికి 70 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది’ అని  వివరించింది. 

కరోనా సంక్షోభం వలన ప్రజలు సోషల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ను పాటించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ స్టడీ వివరించింది. ‘సొంతంగా కారు ఉండాలనే ఆలోచన ప్రజల్లో పెరుగుతుండడంతో సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్‌‌‌‌ విస్తరిస్తోంది. ఇంకో ఐదేళ్లలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు కొత్త కార్ల అమ్మకాల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా జరుగుతాయి’ అని ఓఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఆటోస్‌‌‌‌ ఇండియా సీఈఓ అమిత్ కుమార్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. డిజిటలైజేషన్ వలన పారదర్శకత పెరిగిందని, కార్లను ఎంచుకోవడంలో కస్టమర్లకు ఛాయిస్‌‌‌‌ పెరిగిందని  చెప్పారు. ఈ స్టడీ ద్వారా తెలిసిన అంశాల ద్వారా సెకండ్ హ్యాండ్ కారు సెక్టార్లో మరిన్ని ఇన్నొవేషన్స్‌‌‌‌ వస్తాయని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం వలన ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు ఇప్పట్లో మారవని ఓఎల్‌‌‌‌ఎక్స్ ఆటోస్‌‌‌‌–క్రిసిల్‌‌‌‌ స్టడీ అంచనా వేసింది. 

సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్లకు సౌత్‌‌‌‌లోనే ఎక్కువ డిమాండ్‌‌‌‌..
కరోనా ఫస్ట్‌‌‌‌వేవ్ టైమ్‌‌‌‌లో సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్లకు ఫుల్‌‌‌‌ డి మాండ్ క్రియేట్‌‌‌‌ అయ్యిందని, ముఖ్యంగా సౌత్‌‌‌‌, వెస్ట్‌‌‌‌  ప్రాంతాల్లో ఈ కార్ల నిల్వలు 45-50 రోజుల నుంచి  30-35 రోజులకు తగ్గాయని ఈ స్టడీ వెల్లడించింది. సప్లయ్ లెవెల్స్‌‌‌‌ 2021 లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నాయని  తెలిపింది. కరోనా రిస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో, వెహికల్స్‌‌‌‌ను అమ్మడానికి సెల్లర్లు ముందుకు రావడం వంటివి సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్లు సప్లయ్ పెరగడానికి కారణమయ్యాయని ఈ స్టడీ వివరించింది. కొత్త కార్ల సప్లయ్‌‌‌‌ పెరగడంతో పాటే,  సెకండ్ హ్యాండ్ కార్ల సప్లయ్ కూడా పెరిగిందని తెలిపింది. కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్‌‌‌‌ 20-30 శాతం ఎగిసింది. సౌత్‌‌‌‌లోనే ఇటువంటి కార్లకు డిమాండ్‌‌‌‌ ఎక్కువగా ఉంది. తర్వాత పశ్చిమ రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా క్రియేట్‌‌‌‌ అయ్యింది. తూర్పు రాష్ట్రాల్లో డిమాండ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉందని ఈ స్టడీ వెల్లడించింది. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో యుటిలిటీ వెహికల్స్‌‌‌‌ వాటా 2020-21 లో  20 శాతానికి పెరిగింది. 2017-18  టైమ్‌‌‌‌లో ఈ వాటా 18 శాతంగా ఉంది. వెహికల్స్ ఏజ్‌‌‌‌ను బట్టి చూస్తే, 5-7 ఏళ్ల మధ్య ఉన్న కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌‌‌‌లో  ఈ కార్ల వాటా 31 శాతంగా ఉంది. 8-10 ఏళ్ల ఏజ్‌‌‌‌ ఉన్న కార్ల వాటా 29 శాతంగా ఉంది.