బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉండటంతో Y+ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు. అయినప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం సల్మాన్ ఖాన్ ని బెదిరిచడం ఆపడం లేదు.
ఈ క్రమంలో ఈరోజు (అక్టోబర్ 18) మరోసారి "ఈ మెసేజ్ ని తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే తమకి రూ. 5 కోట్లు ఇవ్వాలని అలాగే లారెన్స్ బిష్ణోయ్ తో శత్రుత్వం ముగించి తమ డిమాండ్లు తీర్చాలని లేదంటే సల్మాన్ ఖాన్ ని దారుణంగా హత్య చేస్తామని" ముంబై పోలీసులకి మెసేజ్ పంపించారు. దీంతో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి హాజరావుతాడా లేదా అనే విషయంపై పలు సందేహాలు నెలకొన్నాయి.
అయితే బీ టౌన్ సినీ వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో బిగ్ బాస్ షోని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దాదాపుగా 60 మంది సెక్యూరిటీ గార్డ్స్ సల్మాన్ ఖాన్ రక్షణ కోసం బిగ్ బాస్ హౌజ్ సెట్ చుట్టూ పోలీసులు కాపలాగా ఉంచారట. దీంతో పోలీసుల పర్మిషన్ లేకుండా సెట్ నుంచి బయటికి వెళ్లడం లేదా రావడం వంటివి జరగవట. అలాగే సరైన ఆధార్ కార్డ్ లేదా ఐడెంటిటీ కార్డు లేకుండా బయటి వ్యక్తులెవరూ బిగ్ బాస్ సెట్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించనట్లు సమాచారం.