
రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సినిమా అయితే రాలేదు కానీ తన కొత్త సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు సల్మాన్. తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది.
దాన్ని నిజం చేస్తూ టైటిల్‌తో సహా ఈ మూవీని అనౌన్స్ చేశారు. ‘సికందర్’ అనే టైటిల్‌ను దీనికి ఫిక్స్ చేశారు. సాజిద్ నడియాద్వాలా దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది ఈద్‌ను అక్షయ్ ‘బడే మియా చోటా మియా’, అజయ్ దేవగన్ ‘మైదాన్’ చిత్రాలతో జరుపుకోవాలని, వచ్చే ఏడాది పండుగను తమ ‘సికందర్’తో జరుపుకోవాలని సల్మాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరారు.