చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీతో చాలా జాబ్స్ పోతయ్‌‌‌‌‌‌‌‌..కొత్తవి క్రియేట్ అవుతయ్‌

చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీతో చాలా జాబ్స్ పోతయ్‌‌‌‌‌‌‌‌..కొత్తవి క్రియేట్ అవుతయ్‌

న్యూఢిల్లీ: చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వలన  ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయని  ఈ  ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్‌‌‌‌‌‌‌‌ ఆల్ట్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. సొసైటీ రూపురేఖలను ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ మారుస్తుందని చెప్పారు. ఏఐ వలన కొన్ని సమస్యలు లేకపోలేదని, కానీ, మనుషులు ఇంత వరకు ఇలాంటి గొప్ప టెక్నాలజీని డెవలప్ చేయలేదని అభిప్రాయపడ్డారు. ‘చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీతో ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయి. మనం వీటికంటే మెరుగైన జాబ్స్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేస్తాం.

మన జీవితాలను మరింత మెరుగ్గా మార్చడానికే  ఏఐని డెవలప్ చేస్తున్నాం’ అని శామ్‌‌‌‌‌‌‌‌ ఆల్ట్‌‌‌‌‌‌‌‌మన్ పేర్కొన్నారు.  ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ల వలన విద్యార్ధుల్లో బద్ధకం పెరిగిపోతుందనే దానిపై ఆయన మాట్లాడారు. ‘ఎడ్యుకేషన్ మారుతూ ఉండాలి. టెక్నాలజీ వలన అనేక సార్లు ఇది జరిగింది. కాలిక్యులేటర్ రావడంతో  మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌ చెప్పడం, స్టూడెంట్లను టెస్ట్  చేయడం పూర్తిగా మారింది’ అని వివరించారు. ఆల్ట్ మన్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీని పనిలో సాయంగా వాడుకోవాలని  అన్నారు. కాగా,  టెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జనరేట్  చేసే ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ ప్లస్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు కిందటి వారం నుంచి ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. జీపీటీ–4 వంటి కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.