హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలోని వివిధ కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును విద్యాశాఖ పొడిగించింది. స్టేట్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసుల్లోని కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత గల ప్రభుత్వ స్కూళ్ల జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టుల అర్హతలు, నిబంధనలు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు.
