గ్లోబల్ సమిట్లో సామల వేణు మ్యాజిక్ షో

గ్లోబల్ సమిట్లో సామల వేణు మ్యాజిక్ షో

పద్మారావునగర్​,వెలుగు: తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్​లో ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్​ సామల వేణు ఇంద్రజాల ప్రదర్శనతో అలరించనున్నారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్​ 8న ప్రారంభమయ్యే సదస్సులో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి కూడా ఉంటుంది. పి.జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరిణి నాట్య ప్రదర్శనలు ఉంటాయి. 

తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిభించించేలా కొమ్ము కోయ, బంజారా కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు మహిళల డప్పులు, బోనాలతో అతిథులను ఆహ్వానించనున్నారు. ప్రపంచంలోని 50 దేశాల నుంచి 2 వేల మంది డెలిగేట్స్​ ఈ సమిట్ కు హాజరుకానున్నారు.