
ఇటీవల పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బ్ అయిన సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్‌లో బిజీ అవుతోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు తన బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి డివోషనల్ ట్రిప్‌కి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సోషల్ సర్వీస్ విషయంలోనూ ఒకడుగు ఎప్పుడూ ముందుండే సమంత, ఈ టూర్‌లోనూ అందుకోసం కొంత సమయం కేటాయించింది. కాశ్మీర్‌కి చెందిన దూసల అనే చేనేత వస్త్రాలు నేసే వారికి అండగా నిలిచింది. అక్కడ ఉన్నన్ని రోజులూ వారు నేసిన డ్రెస్సులనే వేసుకున్న సమంత, తన ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అలాగే దూసల నేత కార్మికులకు సపోర్ట్ చేయాలని తన ఫాలోవర్స్‌కు పిలుపునిచ్చింది. గతంలో తెలంగాణ చేనేతని కూడా తను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి అటు కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్‌గానూ ఎంతో మందికి అండగా ఉంటోన్న ఆమెను చూసి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ అంతా సూపర్బ్ సమంత అంటూ మెచ్చుకుంటున్నారు.