బ్లాక్ శారీ..చంకీల బ్లౌజ్లో సమంత.. న్యూయార్క్ నగర ఫొటోస్ వైరల్‌

బ్లాక్ శారీ..చంకీల బ్లౌజ్లో సమంత.. న్యూయార్క్ నగర ఫొటోస్ వైరల్‌

టాలీవుడ్ స్టార్ ​హీరోయిన్ ​సమంత(Samantha) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్​తో ఎప్పుడు టచ్ లో ఉంటారు. లేటెస్ట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో న్యూయార్క్ నగరంలో విహరిస్తూ హాట్ లుక్స్ తో ఫోటోస్ పోస్ట్ చేసింది. మూడు నెలల పాటు ట్రీట్‌మెంటే లోకంగా గడిపేస్తుందిలే అనుకున్న ఫ్యాన్స్ కు..ఈ ఫొటోస్ తో మతి పోగెట్టుస్తుంది. 

బ్లాక్ శారీలో..చంకీల బ్లౌజ్ తో.. తన కను చూపులతో..నడుము అందాలు చూపిస్తూ..న్యూయార్క్ నగరం చుట్టేస్తోంది. దీంతో సామ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రీట్‌మెంట్ కోసం వెళ్ళావా?ఫోటో షూట్ కోసమా?.. అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే సామ్ స్టన్నింగ్ లుక్స్ వెనుక మీనింగ్ ఏంటనేది తెలియట్లేదు అంటూ..మరి కొందరు రెస్పాండ్ అవుతున్నారు. ప్రసెంట్ సోషల్ మీడియాలో సమంత పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టడం తప్పితే.. సామ్‌ ఇప్పట్లో కనిపించదు.మూడు నెలలపాటు న్యూయార్క్‌లో వుంటూ..మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటుంది. ఇప్పట్లో ఎంజాయ్‌మెంట్‌ వుండదని..అందరు అనుకున్నారు. రీసెంట్ గా బాలి వెళ్లి ఖుషీ అయి వచ్చింది సమంత.ఇక ఖుషీ మ్యూజిక్‌ ఈవెంట్‌లో ఎనర్జీతో కనిపించిన సామ్‌..తన డ్యాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో  సమంత నటిస్తున్న మూవీ ఖుషి(Kushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ వచ్చే నెల సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.