Samantha: ఈ ప్రేమ చాలా ప్రత్యేకం.. సమంత ఇన్స్టా పోస్ట్ వైరల్

Samantha: ఈ ప్రేమ చాలా ప్రత్యేకం.. సమంత ఇన్స్టా పోస్ట్ వైరల్

సౌత్ బ్యూటీ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ గా ఆమె లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు సేవా కార్యక్రమాలతో కూడా ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు సమంత. ఇక చాలా కాలం గా మాయోసైటిస్ వ్యాధితో భాదపడ్డ సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ఖుషీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.  తాజాగా ఆమె తన సొంతూరు చెన్నైకి వెళ్లారు. అక్కడ సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబందించిన ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు సామ్. దానికి.. సొంతూరిలో దక్కే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. హాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయినా సిటాడెల్ ను హిందీలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కోసం యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు సమంత. మరి ఈ సిరీస్ సమంతకు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.