సమంత రేర్ రికార్డ్.. ఆ సర్వేలో టాప్ ఈ స్టార్ బ్యూటీనే

సమంత రేర్ రికార్డ్.. ఆ సర్వేలో టాప్ ఈ స్టార్ బ్యూటీనే

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మరో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా చేసిన ఒక సర్వేలో ఆమెనే టాప్ లో నిలిచారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్స్ ఇండియా అనే సంస్థ ఇండియాలో ఉన్న స్టార్స్ పై సర్వేను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా జూన్ నెలకు గాను ఇండియాలోని టాప్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు అనేదానిపై జరిగిన సర్వే రిజల్ట్ ను విడుదల చేశారు.

ఇందులో దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా నిలిచారు సమంత. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా వస్తున్న ఖుషి(Khushi) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు సమంత. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్(Varun dhavan) హీరోగా నటిస్తున్నారు. 

ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసిన సమంత.. గతకొంత కాలంగా బాధపడుతున్న మాయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు.