కొత్త ప్రేమతో సమంత..లేటెస్ట్ సామ్ ఇన్స్టా స్టోరీ వైరల్

కొత్త ప్రేమతో సమంత..లేటెస్ట్ సామ్ ఇన్స్టా స్టోరీ  వైరల్

టాలీవుడ్  స్టార్​హీరోయిన్​సమంత(Samantha) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్​తో ఎప్పుడు టచ్ లో ఉంటారు. లేటెస్ట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ ​స్టోరీలో లైఫ్ అప్డేట్స్ కి సంబంధించి ఫోటో పోస్ట్ చేసింది. ఈ  ఫోటో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. కొత్త ప్రేమతో..కొత్త ఆవిష్కరణలు అంటూ మూడు లవ్ ఎమోజీలను పెట్టింది.ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్న ఈ కొటేషన్ వెనుక చాలా మీనింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. 

దీంతో పాటుగా..అక్కడ ఒక గ్లాస్‌లో వాటర్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. ఆ వాటర్ ప్రతిబింబంలో తన కొత్త ప్రేమను వ్యక్త పరుస్తూ పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. అలాగే సమంత చేతికి ఉన్న బ్రాస్ లైట్ చుట్టూ లవ్ అనే పదంతో ఉండటంతో..సోషల్ మీడియాలో భిన్నమైనా కామెంట్స్ వినిపిస్తోన్నాయి.  

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ చేసిన..చాలా మీనింగ్ ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తుండటం విశేషం. లేటెస్ట్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బాలీ ట్రిప్ కు వెళ్లిన సామ్..ఇప్పుడు అమెరికా వెళ్లిందని సమాచారం. ఇక రీసెంట్గా ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో చేసిన డ్యాన్స్.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా విషయం తెలిసిందే. ఇక సమంత మాయోసైటీస్ వ్యాధితో స్ట్రగుల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్లు సమాచారం.     

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తో లేటెస్ట్ ఖుషీ(Khushi) మూవీ చేస్తుంది. క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది