- పరస్పర అంగీకారంతోనే తీసుకున్నం
- రాజకీయం చేయడం తగదని కామెంట్
తన విడాకులు వ్యక్తిగతం అని, పరస్పర అంగీకారంతోనే తీసుకున్నామని నటి సమంత అన్నారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై ఆమె ట్విట్టర్లో స్పందించారు. ఇతరుల పట్ల బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. ‘‘నా విడాకుల అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి. ఓ మహిళగా ఉండటానికి.. బయటకు వచ్చి పని చేయడానికి చాలా ధైర్యం కావాలి. గ్లామరస్ ఇండస్ట్రీలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ప్రేమ నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి బలం కావాలి.
కొండా సురేఖ గారూ.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందనే విషయం మీరు గ్రహించారని ఆశిస్తున్న. ఇతరుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్న. నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేనెప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా”అని తన పోస్ట్‌లో సమంత చెప్పారు.