V6 News

ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు.. ‘మా ఇంటి బంగారం’పై డైరెక్టర్ నందినీ రెడ్డి

ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు.. ‘మా ఇంటి బంగారం’పై డైరెక్టర్ నందినీ రెడ్డి

సమంత లీడ్‌‌‌‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుదల కానుంది. మంగళవారం సమంత బర్త్‌‌‌‌డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోతో ఆమెకు విషెస్ తెలియజేశారు మేకర్స్.  ఇందులో సమంత పెర్ఫార్మెన్స్‌‌‌‌ గురించి టీమ్‌‌‌‌లో ఒక్కొక్కరు వివరిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

గన్‌‌‌‌ పట్టుకోవడం దగ్గర నుంచి పంచ్ కొట్టడం వరకు ప్రతి షాట్‌‌‌‌లో  ఆమె నటించిన తీరు అందర్నీ మెస్మరైజ్ చేస్తుందని డైరెక్టర్ నందినీ రెడ్డి చెప్పారు. ‘సామ్‌‌‌‌తో కామెడీ చూసినప్పుడు సూపర్ అనుకుంటాం. ఎమోషన్ చూసినప్పుడు అదిరిపోయింది అనుకుంటాం. యాక్షన్ చూసినప్పపుడు అరె యాక్షనే  చేయాలనుకుంటాం. అలా ప్రతి విషయంలోనూ ఆమె మ్యాజిక్ చేస్తుంది’ అని నందినీ రెడ్డి చెప్పారు.

అలాగే ‘షీ ఈజ్ ద బీస్ట్’ అని యాక్షన్ కొరియోగ్రాఫర్  చెబుతుండగా వీడియోలో సమంత చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లు చూపించడం హైలైట్‌‌‌‌గా నిలిచింది. శారీ ఉండి యాక్షన్ సీక్వెన్సులు చేయడం అనే ఐడియా చాలా కొత్త ఉంటుందని క్రియేటర్ రాజ్ నిడిమోరు చెప్పారు. ఈ చిత్రంలో ఆమె పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పెర్ఫార్మెన్స్ చేసిందని సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ అన్నారు. ఫైనల్‌‌‌‌గా ‘ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు.. చూస్తారుగా’ అని సమంత చెప్పడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.  దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి  సంతోష్ నారాయణన్  సంగీతం అందించాడు.