శారీలో సమంత స్టంట్స్‌‌

శారీలో సమంత స్టంట్స్‌‌

ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత పర్సనల్‌‌ లైఫ్‌‌లో హ్యాపీగా ఉన్నారు. మరోవైపు ఆమె తన నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా  మూవింగ్ పిక్చర్స్‌‌ బ్యానర్‌‌‌‌పై సమంత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కో ప్రొడ్యూసర్స్. ఈ సినిమా కోసం ఎలాంటి డూప్ సహాయం లేకుండా యాక్షన్‌‌ సీన్స్‌‌లో నటిస్తోందట సమంత. 

ది ఫ్యామిలీ మ్యాన్‌‌ 2, సిటాడెల్‌‌ లాంటి వెబ్‌‌ సిరీస్‌‌లతో తాను యాక్షన్‌‌ సీన్స్‌‌లోనూ మెప్పించగలనని ఆమె  ప్రూవ్ చేసుకుంది. అయితే ఈసారి చీరకట్టులో స్టంట్స్‌‌ చేస్తుండడం విశేషం. అంతేకాదు తన కెరీర్‌‌‌‌లోనే ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పాత్ర ఇదేనని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ లీ విటేకర్ దీనికి స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. 

ఎయిటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌‌‌లో  సమంత చేసిన యాక్షన్ సీన్స్‌‌ సినిమాకు స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌ గా నిలుస్తాయని మేకర్స్‌‌ భావిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సమంతతో నటించడం చాలా ఈజీ అని, తమ ఆన్‌‌స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకోనుందని గుల్షన్‌‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.