Samantha: నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సామ్

Samantha:  నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సామ్

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సినీ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ కు సైలెంట్ గానే గట్టి రిప్లై ఇచ్చి అతని నోరు మూయించింది. దీంతో సామ్ మరోసారి ట్రెండింగ్ గా మారింది. అయితే ఇంతకీ ఆ నెటిజన్ చేసిన ట్వీట్ ఏంటీ.. సామ్ ఇచ్చిన రిప్లై ఏంటీ అన్న విషయానికొస్తే.. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయతార నటించిన కనెక్ట్ సినిమా పోస్టర్ తో పాటు మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన పోస్టర్లను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇలాంటి సీన్లు పదేళ్ల క్రితం అస్సలు ఊహించలేకపోయామని అనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు. ఈ పోస్టును చూసిన సామ్.. మహిళలు ఎదుగుతున్నారు అని ఆ పోస్ట్ ను రీట్వీట్ చేశారు. అయితే సమంత చేసిన ఈ పోస్ట్ కు ఓ నెటిజన్ మళ్లీ పడిపోయేందుకు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 

దీంతో సమంత, ఆ నెటిజన్ కి సైలెంట్ గా గట్టిగానే రిప్లై ఇచ్చింది. ‘బౌన్స్ బ్యాక్ కావడం మునుపటి కంటే మరింత స్వీట్‌గా ఉంటుంది మిత్రమా’ అంటూ సామ్ మరింత స్ట్రాంగ్ గా ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సమంత ఇచ్చిన రిప్లైకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..  తదుపరి చిత్రాలకు ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ చెప్పింది. దీంతో ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఖుషి’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు వరుణ్ ధావన్‌తో చేయాల్సిన బాలీవుడ్ మూవీ ‘సిటాడెల్’ నుంచి కూడా సామ్ తప్పుకున్నట్లు వార్తలు వస్తు్న్నాయి.