బాలీ బీచ్లో సమంత.. వైఏమ్సీ టాటూ వైరల్

బాలీ బీచ్లో సమంత.. వైఏమ్సీ టాటూ వైరల్

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఈ మధ్య ఏం చేసినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఆధ్యాత్మిక యాత్రతో సోషల్ మీడియాలో తెగ వైరలైన సమంత.. ప్రస్తుతం హాలిడే ట్రిప్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈట్రిప్ కు సంబంధించిన ఫొటోస్ ను ఎప్పుటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఈ ఫొటోస్ లో ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్స్ తో బాలీ ట్రిప్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తన ఫ్రెండ్స్ తో దిగిన, బీచ్ లో దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఒక ఫొటోలో సమంత మెడ వెనుక భాగంలో ఉన్న టాటూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ టాటూలో వైఏమ్సీ(YMC) అని రాసుంది. వైఏమ్సీ అంటే ఏం మాయ చేశావే(Yem Maya Cheshave) అని. ఇది సమంత నటించిన మొదటి సినిమా. ఆ గుర్తుగా సమంత ఈ టాటూ వేయించుకున్నారని సమాచారం. దీంతో ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ సమంత ఇంకా పాత జ్ఞాపకాలను మర్చిపోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వస్తున్న ఖుషీ(Khushi) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్(Varun Dhavan) జంటగా సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది సమంత.