సమరభేరీ మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం.. రాప్తాడు సభలో సీఎం జగన్

సమరభేరీ మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం.. రాప్తాడు సభలో సీఎం జగన్

మరో రెండు నెలల్లో జరిగే  కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పని చేయడానికి..  మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నానని రాప్తాడు సభలో సీఎం జగన్ అన్నారు.  సమరభేరీ మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం అంటూ ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా. మీరు 2, 3  సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు.. అందుకే మన టార్గెట్‌ 175కి 175...మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ తగ్గే పరిస్థితి లేదు..వైఎస్సార్‌సీపీ మీ అందరి పార్టీ...మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు..గతంలో లంచాలు పిండుతూ తన వారికి పథకాలిచ్చారు... ఇప్పుడు నేరుగా ఎటువంటి లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోకే వస్తున్నాయి.

ఈ రోజు గర్వంగా చెబుతున్నా. మాట ఇచ్చాం.. మాట నెరవేర్చాం..  మళ్లీ ప్రజల దగ్గరికి మాట ఇచ్చి నెరవేర్చామని ధైర్యంగా వెళ్లగలుగుతున్నామన్నారు. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి అందరూ కూడా సిద్ధమేనా అడుగుతున్నా.. ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ కూడా మీ సెల్‌ఫోన్‌ తీసి టార్చ్‌ ఆన్‌ చేసి సిద్ధమే అని చెప్పండి
ప్రతీ కార్యకర్త బూత్‌ కమిటీ సభ్యులుగా, వాలంటీర్లుగా, గృహసారథులుగా మీ పాత్ర పోషించండి.. మీ పాత్ర ఇక్కడ అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు. 

ఎన్నికలకు ముందు రంగు రంగుల మేనిఫెస్టోతో హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, రైతన్నలను పట్టించుకోకుండా , ఏ ఒక్కరినీ పట్టించుకోకుండా ఆ మేనిఫెస్టోను తీసి చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు.. ప్రజలకు మంచి అనేది చేయకుండా దేనికి మీరు సంసిద్ధం అని అడుగుతున్నానన్నారు.చంద్రబాబు పెత్తందారుల తరఫున సంసిద్ధం అంటున్నారు..మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడో అడగండి..జగన్‌ మార్క్‌ ప్రతీ సామాజిక వర్గంలోనూ కనిపిస్తున్నప్పుడు చంద్రబాబుకు ఎందుకు ఓ‍టు వేయాలో ఈ వేదిక పైనుంచే నేను నేరుగా అడుగుతున్నా..ప్రజలకు మంచి చేయాలనేప్పుడు ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు రాప్తాడు వేదికగా ప్రశ్నించారు.

ప్రతీ పేదవాడికి అండగా నిలబడుతూ.. సిద్ధం అని పేదవాడి తరఫున మేము నిలబడుతూ ఉంటే.. చంద్రబాబు సంసిద్ధం అంటూ పెత్తందార్ల వైపు నడుస్తున్నాడు
నువ్వు(చంద్రబాబు) దేనికి సంసిద్ధం అని అడుగుతున్నా..దుష్టచతుష్టయం బాణాలకు తలవంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ప్రజలున్నారు.పేదవాడి బతుకు మార్చేందుకు మనం యుద్ధం చేస్తున్నాం..జగన్‌ ప్రతీ ఇంటికి మంచి చేశాడు కాబట్టే, ప్రతీ సామాజిక వర్గానికి మంచి చేశాడు కాబట్టే, ప్రతీ పేదవాడు గుండెల్లో పెట్టుకున్నాడు కాబటే.. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రాప్తాడు సభలో సీఎం జగన్ అన్నారు.