రెండేండ్లకు మళ్లొస్తం తల్లీ.. ముగిసిన సమ్మక్క, సారలమ్మ జాతర..వన ప్రవేశం చేసిన వనదేవతలు

రెండేండ్లకు మళ్లొస్తం తల్లీ.. ముగిసిన సమ్మక్క, సారలమ్మ జాతర..వన ప్రవేశం చేసిన వనదేవతలు

 గోదావరిఖని/కొత్తపల్లి/సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/పెగడపల్లి/వెలుగు: రెండేండ్లకు మళ్లొస్తాం తల్లీ అంటూ.. భక్తులు తిరుగుముఖం పట్టారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాలుగురోజులు సాగిన సమ్మక్క– సారలమ్మ జాతర శనివారంతో ముగిసింది. ఈసారి లక్షలాదిగా తరలివచ్చి భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. 

ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. గోదావరిఖనిలో గోదావరి తీరంలో నాలుగు రోజుల పాటు సుమారు 8 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో మొత్తం 44  హుండీలను ఏర్పాటు చేయగా, వాటిని శనివారం రాత్రి జీఎం కార్యాలయం బి‒గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని సారలమ్మ దేవాలయానికి తరలించి భద్రపరిచారు.

 చివరి రోజు వనదేవతలు వన ప్రవేశం సందర్భంగా భక్తులు వరం పట్టారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి సమ్మక్క- -సారలమ్మ జాతర వనప్రవేశంతో విజయవంతంగా ముగిసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెగడపల్లి, జమ్మికుంట, పెగడపల్లి, తదితర ప్రాంతాల్లోనూ జాతర ప్రశాంతంగా ముగిసింది.