అది మీడియా స్టింగ్ కాదు.. అది ఓ కార్యకర్త అభిప్రాయం కాదు.స్వయంగా లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఫుడ్స్ ఎర్ర కారం పొడి శాంపిల్స్ లో పురుగుమందుల అవశేషాల ఉన్నాయని MRL దాటి ఎక్కువగా ఉన్నట్లు రుజువైన తర్వాత అధికారికంగా పతంజలి కారం పొడి సురక్షితం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఫుడ్స్ యూనిట్ తయారు చేసిన ఎర్ర కారం పొడి అంత సురక్షితం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.ఫుడ్ సేఫ్టీ పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ మహువా మల్హోత్రా లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.ఆహార భద్రత ,ప్రమాణాల నిబంధనల ప్రకారం ఇచ్చిన పరిమితులకు విరుద్ధంగా పతంజలి కారంలో కెమికల్స్ ఉన్నాయని అంత సురక్షితం కాదని చెప్పారు. మరోవైపు అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల శాంపిల్స్ పరీక్షించగా వాటిలో ఎలాంటి హానకరమైన కెమికల్స్ లేవని మంత్రి చెప్పారు.
వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. భారత ఆహార భ్రద, ప్రమాణాల అథారిటీ(FSSAI ) ద్వారా ఆరోగ్య కరమైన ఆహారం లభ్యత, తయారి, నిల్వ, పంపిణీ,అమ్మకం, దిగుమతి వంటి అంశాలపై నియంత్రణ తప్పనిసరి చేసిందన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అన్నారు.
