
చాలామంది సౌత్ హీరోయిన్స్ ఫైనల్ టార్గెట్ బాలీవుడ్. దక్షిణాదిన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటికైనా ఒక్క బాలీవుడ్ సినిమాలోనైనా మెరవాలనే కోరిక వాళ్లకు ఉంటుంది. తాజాగా సంయుక్తా మీనన్ ఈ వరుసలో చేరింది. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇటీవల ముంబైలోని మెహబూబ్ స్టూడియోకు ఆమె వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు ఆమె ముంబై వెళుతున్న వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు రావడంతో.. స్క్రిప్ట్ నేరేషన్ కోసం సంయుక్త ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు సంయుక్త సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సార్, బింబిసార, డెవిల్ చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నిఖిల్‌కు జంటగా ‘స్వయంభు’లో నటిస్తోంది. శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’లోనూ ఆమె నటిస్తోంది. మరికొన్ని టాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.