ది బ్లాక్ గోల్డ్ లో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు

ది బ్లాక్ గోల్డ్ లో  డూప్ లేకుండా యాక్షన్  సీక్వెన్సులు

హీరోయిన్‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, లీడ్ రోల్‌‌‌‌లో సంయుక్త నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’.  ఈ యాక్షన్‌‌‌‌ డ్రామాకు ‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్‌‌‌‌ కేఎంసీ దర్శకుడు.  రాజేష్ దండా నిర్మిస్తున్నారు.  ఇందులో సంయుక్త పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. దీనికోసం ఆమె  డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తోందని టీమ్ తెలియజేసింది.  

ఈ స్టంట్స్‌‌‌‌లో అవుతున్న గాయాలను కూడా  పట్టించుకోకుండా సంయుక్త షూటింగ్ చేస్తున్నట్టు చెబుతూ.. తనకు గాయాలైన ఫొటోను టీమ్ పోస్ట్ చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలవనున్నాయని, సంయుక్త కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది  స్పెషల్ మూవీగా నిలవనుందని అన్నారు.  మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్, బీవీఎస్ రవి ఇతర పాత్రలు పోషిస్తున్న  ఈ చిత్రానికి  సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ,  కన్నడ, హిందీ భాషల్లోనూ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.