సనాతన ధర్మం శాశ్వతమైంది : పొంగులేటి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

సనాతన ధర్మం శాశ్వతమైంది : పొంగులేటి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:  సనాతన ధర్మం శాశ్వతమైందని, ఒక జీవన విధానం అని తమిళనాడు బీజేపీ నేషనల్ సహా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణ్ తిరుపతి, నేషనల్ మీడియా వింగ్ సెక్రటరీ కేకే శర్మతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 


తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ‘నా మట్టి, నా ప్రజలు’ (ఎన్ మన్, ఎన్ మక్కల్) యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డీఎంకే నేతలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ పెరుగుతున్నదని, దీనిని చూసి ఓర్వలేకే సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది గౌరవించే సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తుంటే.. కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. 


తమిళనాడు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, పాలనలో విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు ఓటమి ఫోబియా పట్టుకుందని, అందుకే కిషన్ రెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పొంగులేటి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కిషన్ రెడ్డిని అరెస్ట్  చేశారని ఆరోపించారు.