కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా..20 ట్రాక్టర్లు సీజ్ 

కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా..20 ట్రాక్టర్లు సీజ్ 

కరీంనగర్ జిల్లా  తీగల బ్రిడ్జి దగ్గర మానేరు వాగులో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్నారు పోలీసులు. 20 ట్రాక్టర్లను సీజ్ చేశారు. పోలీసులను చూసి వాగులోనే ఇసుక ట్రాక్టర్లు వదిలేసి పారిపోయారు డ్రైవర్లు.నిన్న కూడా కరీంనగర్ జిల్లా మానకొండూరు దగ్గర  మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 19 లారీలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న లారీలను హైదరాబాద్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు తరలించి.. ఆ తర్వాత తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు అప్పగించామన్నారు. లారీలను  సీజ్ చేశామన్న పోలీసులు...   యజమానులు, డ్రైవర్లపై కేసులను నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన ఈ లారీలు ఎవరివి, ఎప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం వివరించలేదు పోలీసులు. అయితే మరో 10 దాకా లారీలు తప్పించుకుపోయినట్లు ప్రచారం జరుగుతోంది.