ఇసుక రవాణా అడ్డుకున్నాడని టిప్పర్‌తో తొక్కించారు

ఇసుక రవాణా అడ్డుకున్నాడని టిప్పర్‌తో తొక్కించారు

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. మాశాల గ్రామం దగ్గర అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన అనిల్ అనే యువకుడిని టిప్పర్‌తో తొక్కించారు. ఓవర్ స్పీడ్‌తో వచ్చిన టిప్పర్ యువకుడి కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అనిల్.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. హాస్పిటల్ దగ్గర అనిల్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రంతా టిప్పర్లలో ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాశాల గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో కూడా భారీగా ఇసుక డంపులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇసుక అక్రమ దందా చేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎస్ఐ మరియు తహశీల్దార్‌లను సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు.