హలో నేను కలెక్టర్ ను..మీ ఆరోగ్యం ఎలా ఉంది?

హలో నేను కలెక్టర్ ను..మీ ఆరోగ్యం ఎలా ఉంది?

సంగారెడ్డి, వెలుగు: ‘హలో.. ఎలా ఉన్నారు..? మీ ఆరోగ్యం ఎలా ఉంది.. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నారా.. భయపడకండి  మీకు మేమున్నాం’ అంటూ కలెక్టర్  హనుమంతరావు కరోనా పేషెంట్లకు భరోసా ఇచ్చారు. బుధవారం కలెక్టరేట్ లోని తన  చాంబర్ నుంచి పేషెంట్లకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎంఎన్ఆర్ ఇతర హాస్పటల్లోని కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లకు నేరుగా ఫోన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అధైర్య పడకుండా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలని, మీకు ఎలాంటి అవసరం వచ్చినా అడగాలన్నారు. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్లను క్రమం తప్పకుండా వాడి వారు చెప్పేసూచనలు పాటించాలని సూచించారు. అనంతరం అడిషనల్‌‌‌‌ కలెక్టర్  రాజర్ షా, జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య చికిత్సలు, పెరుగుతున్న పాజిటివ్ కేసుల కంట్రోల్‌‌‌‌కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.