కేసీఆర్​స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్

కేసీఆర్​స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలన్నింటికీ ఈనెల 5 లోపు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో బీసీ, మైనార్టీలకు ఆర్థిక సాయం, గృహలక్ష్మి మంజూరి ఉత్తర్వులు, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు, బతుకమ్మ చీరెల పంపిణీ, సీఎం అల్పాహారం ప్రారంభానికి  ఏర్పాట్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశ నిర్దేశం చేశారు.

బతుకమ్మ చీరెలు అన్ని మండలాలకు చేరుకున్నాయని చెప్పారు. రెండు రోజుల్లోగా చీరెల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. కేసీఆర్​ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ డీపీవో, బతుకమ్మ చీరెల పంపిణీని డీఆర్డీవో పర్యవేక్షించాలని సూచించారు. 6న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం అల్పాహారం పథకాన్ని ప్రారంభించడానికి ప్రతి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఒక పాఠశాలను గుర్తించి

స్థానిక ఎమ్మెల్యేల సమన్వయంతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. 6లోగా బీసీ కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పారు. జిల్లా లక్ష్యం మేరకు నర్సరీల ఎస్టిమేట్ జనరేట్ చేసి, రెండు రోజులలోగా పరిపాలన ఉత్తర్వులు తీసుకోవాలని సూచించారు.