మైనార్టీ గురుకుల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

మైనార్టీ గురుకుల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల స్కూల్​లో5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం అడ్మిషన్లకు సంబంధించిన ప్రచార పోస్టర్‌‌ను కలెక్టర్ క్రాంతి ఆవిష్కరించారు.

 మైనార్టీ స్టూడెంట్స్​ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, జిల్లా మైనారిటీ గురుకుల స్కూల్​హెచ్ ఎంలు పాల్గొన్నారు.