కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ట్రాఫిక్ ఛ‌లాన్లు నిలిపివేయాలి

కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ట్రాఫిక్ ఛ‌లాన్లు నిలిపివేయాలి

హైద‌రాబాద్: అసెంబ్లీలో ప్రతి పక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. రాష్ట్రంలో ఆటో వాలలు, క్యాబ్ డ్రైవర్లు,బైకర్లు అనేక ఇబ్బందులు ఎదురు కుంటున్నార‌ని, వారిపై ఇష్టానుసారంగా ట్రాఫిక్ ఛ‌లాన్లు వేస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్పటికే కరోనా కారణంగా అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహాన‌దారులకు…ప్రభుత్వం త‌న ఖజానా నింపుకోవడానికి ట్రాఫిక్ పోలీసులతో ఛ‌లాన్లు వేయిస్తున్నార‌ని అన్నారు.

ఆటో డ్రైవర్లు,కార్లు నడిపేవారు సంపాదించింది అంత ఛ‌లాన్లకే పోతుందని, నిన్న ఒక కారుకు పెనాల్టీ తో పాటు రూ.18000 వేల ఛ‌లానాను వేశారన్నారు. ఈ సమస్యలతో అనేక మంది ఎదుర్కొంటున్నార‌ని…ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనుకుంటే త‌న‌కు అవకాశ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఇష్టానుసారంగా ఛ‌లాన్లు వేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ట్రాఫిక్ ఛ‌లాన్లు నిలిపివేయాల‌ని, వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ప్రభుత్వం చూడాలని జ‌గ్గారెడ్డి అన్నారు