'మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందజేయగా, నిర్మాత ఎస్ కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి బెస్ట్ విషెస్ అందించారు. ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల రచయితగా వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలియజేశారు.
