ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫైన‌ల్లోకి సానియా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫైన‌ల్లోకి సానియా జోడి

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మిక్స్‌డ్ డ‌బుల్స్ సెమీస్‌లో విజయం సాధించిన సానియా మీర్జా-, రోహ‌న్ బొప్పన్న జోడీ ఫైనల్ కు చేరుకుంది.   గంటా 52 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో భారత జోడీ  7-6, 6-7 (10-6) స్కోర్‌తో నీల్ సుపిస్కీ-డిసేరి క్రాజాక్ జంట‌పై గెలుపొందారు.  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ త‌న చివ‌రి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అవుతుంద‌ని ఇప్పటికే సానియా స్పష్టం చేయడంతో చివ‌రి టైటిల్ కోసం ఆమె  తీవ్రంగా శ్రమిస్తోంది. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా   36 ఏళ్ల సానియా తన కెరీర్‌లో మూడు మహిళల డబుల్స్ , అనేక మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది, 42 ఏళ్ల బోపన్న ఒక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.